ఏపీలోని తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చిల్లకూరు మండలం అల్లిపురం గిరిజన కాలనీలో బట్టలు ఉతుకుతూ ఇద్దరు చిన్నారులు ప్రమావదశాత్తూ కాలువలో పడిపోయి చనిపోయారు. మృతులు నాగేంద్రమ్మ(11), చింతాలయ్య(10)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.