ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం
సమ్మేళనంలో పాల్గొన్న నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు.. ఎప్పుడో దశాబ్దాల క్రితం రాణుల దగ
్గర సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడు వారిగా చలామణి అవుతూ మాట్లాడుతున్నారని అన్నారు. దీంతో అక్కడి తెలుగు సంఘాలు నటి కస్తూరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.