డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా
పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం తర్వాత పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 66.67 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 58.89, భారత్ 55.88 వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ 48.21, శ్రీలంక 45.45 తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.