విషాదం.. రోడ్డుప్రమాదంలో టీవీ నటుడు మృతి
ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. టెలివిజన్ నటుడు అమన్ జైస్వాల్ (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జైస్వాల్ జోగేశ్వరి హైవేపై బైక్ పై వెళ్తుండగా ట్రక్కు బలంగా ఢీకొట్టింది. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్ల తెలిపారు. అమన్ జైస్వాల్ అకాల మరణం వార్తా విని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు.