ఎంపీడీవోపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్
ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై జరిగిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శనివారం కడప వెళ్లనున్న పవన్.. వైకాపా నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు.