పంతంగి టోల్గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ
సంక్రాంతి పండుగకుసొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యాదాద్రి జిల్లా పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్దకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. పంతంగి టోల్‌ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలను అనుమతిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో నెమ్మదిగా కదులుతున్నాయి.