ఓ చిన్ని సందులో నడుచుకుంటూ వెళ్లున్న మహిళపై ఎదురుగా వస్తున్న ఎద్దు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దాడిలో ఎద్దు మొదట తన కొమ్ముతో మహిళను గోడకు నెట్టివేస్తుంది. తర్వాత ఆ స్త్రీ ఎద్దు కొమ్ముల్లో ఒకదాన్ని పట్టుకుని తప్పించుకునేందుకు చూసింది. అదే సమయంలో ఒక వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి ఎద్దు కొమ్ములను చేతులతో పట్టుకుని దానిని అక్కడి నుంచి తరిమేశాడు.