
పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడగా చికిత్స తర్వాత కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ మాదాపూర్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్‌ను పరామర్శించారు.