అక్టోబర్ 3న తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 3వ తేదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లో జరగనున్న వారాహి బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు పవన్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.