పుట్టినరోజే యువతి మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు (వీడియో)
TG: సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన మాజిక కావ్య (16) అనే యువతికి గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. కావ్య పుట్టిన రోజు నాడే చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.