ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో

51చూసినవారు
టీమిండియా క్రికెటర్లంతా నేడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ హౌస్‌లో భారత క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు. అల్బనీస్‌ టీమిండియా క్రికెటర్లందరితో కరచాలనం చేసి.. కాసేపు ముచ్చటించారు. అనంతరం భారత జట్టు మొత్తం అల్బనీస్‌తో సెల్ఫీ తీసుకున్నారు. కాగా, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్‌ అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 6న ప్రారంభం కానుంది.