CIDకి టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం, సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను సీఐడీకి అప్పగించింది. విచారణ వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తాడేపల్లి, మంగళగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం సీఐడీకి మంగళగిరి డీఎస్పీ ఇప్పటివరకు జరిగిన విచారణ ఫైళ్లను అప్పగించనున్నారు.