దివ్యాంగులకు రాయితీపై పెట్రోల్/డీజిల్
AP: స్వయం ఉపాధితోపాటు ప్రైవేటు సంస్థల్లో పని చేసే దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ‘రాయితీపై పెట్రోల్/డీజిల్’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద 2024-25 ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు రూ.లక్ష చొప్పున రూ.26 లక్షలు కేటాయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తోంది. 3 చక్రాల వాహనాలకు వినియోగించే పెట్రోల్/డీజిల్‌కు అయ్యే ఖర్చులో 50 శాతం రాయితీ ఇవ్వనుంది.