సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని గుర్తించిన పోలీసులు
ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. సైఫ్ పక్కింట్లోని సీసీ టీవీ ఫుటేజ్ అలాగే నిందితుల వేలి ముద్రలు.. అదే విధంగా సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు సైఫ్ ఇంట్లోకి మెట్ల మార్గం ద్వారా ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. చోరీ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.