TG: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గాంధీలపై రిట్ పిటిషన్ వేసింది. ఈ కేసుపై హరీశ్ రావు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.