కర్ణాటకలోని బీదర్‌లో ఏటీఎం వాహన సిబ్బందిపై దోపిడీ దొంగలు పట్టపగలే కాల్పులు జరిపి డబ్బు దోచుకున్నారు. బీదర్‌లోని శివాజీ చౌక్‌లో ఉన్న ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు దుండగులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అనంతరం దుండగులు ఏటీఎం సొమ్ముతో అక్కడి నుంచి పారిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.