మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మీడియా రిపోర్టర్‌పై దాడి చేసినందుకు నిన్న ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేసిన పోలీసులు ఇవాళ దాన్ని మార్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టారు. మరోవైపు ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇవాళ ప్రెస్‌మీట్ పెట్టె ఛాన్స్ ఉంది.