మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘దేవర’ ఖాతాలో అరుదైన ఫీట్ చేరింది. దేవర ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ అత్యధిక మంది వీక్షించిన రెండో సౌతిండియా సినిమాగా నిలిచింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ చార్ట్స్‌లో ఐదో వారంలో కూడా ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.