రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ కాన్వాయ్‌లో ఉన్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. జైపూర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కాన్వాయ్‌లో ఉన్న భద్రతా సిబ్బందితో సహా 9 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో సీఎం భజన్‌లాల్ స్వయంగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో ఢీకొన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.