
వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులు
AP: వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామన్నారు. శనివారం నెల్లూరు జిల్లా సంగంలో ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో రైతులకు అందాల్సిన రూ.1,674 కోట్ల బకాయిలను చెల్లించాం. నెల్లూరు జిల్లాలోని రైతులకు అందాల్సిన రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తాం’ అని తెలిపారు.