AP: మిర్చి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చి రైతులను గట్టెక్కించడమే లక్ష్యమని చెప్పిన సీఎం చంద్రబాబు..క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ధర తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న మిరప రైతులను గట్టెక్కించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎగుమతి దారులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు సహకరించాలని కోరారు.