‘సంక్రాంతికి వస్తున్నాం’.. థియేటర్లలో అదనపు కుర్చీలు (వీడియో)
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో సినిమాకి టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పల్లెటూర్లలోని కొన్ని థియేటర్లలో ఫిక్స్డ్ సీట్లతో పాటు కొన్ని ప్లాస్టిక్ కుర్చీలను కూడా వేసి షోలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫీట్ ఎప్పుడో బెనిఫిట్ షోలకు మాత్రమే కనిపించేది.