జెప్టో తన యూజర్లకు షాక్ ఇస్తోంది. ఒకే ప్రొడక్టును ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు వేర్వేరు ధరలతో విక్రయించటాన్ని బెంగళూరుకు చెందిన పూజ ప్రశ్నించింది. అరకిలో గ్రేప్స్ ధర ఆండ్రాయిడ్‌లో రూ.65, ఐఫోన్‌లో రూ.146గా ఉందని ప్రత్యక్షంగా చూపించారు. క్యాప్సికం ధరలు రూ.37, 69గా ఉన్నాయన్నారు. ఎందుకిలా చేస్తున్నారని జెప్టోను ప్రశ్నించిన వీడియో వైరల్ అయ్యింది. ఆండ్రాయిడ్‌ను పేదలు, ఐఫోన్‌ను ధనవంతులు వాడతారు కాబట్టే అలా చేస్తోందని నెటిజన్లు సెటైర్ వేశారు.