AP: జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాలంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు. గోవాలో అసెంబ్లీ స్థానాలు 40 ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 21. గత ఎన్నికల సమయంలో జనసేన 21 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీట్లతో పవన్ ఏపీలో ఎప్పటికీ సీఎం కాలేడనే అర్థంలో ఆయన ట్వీట్ చేశారు.