తిరుపతి తొక్కిసలాటలో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ అప్‌డేట్ ఇచ్చారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు ఇవాళ తెలిపారు. ముగ్గురిని మాత్రం మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు చెప్పారు. రుయా ఆస్పత్రిలో ఉన్న వారిని స్విమ్స్‌కు తరలించగా, మొత్తం 13 మందికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు మరికాసేపట్లో క్షతగాత్రులను పరామర్శించనున్నారు.