తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను TTD ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఇందులో 41 మందికి గాయాలయ్యాయని, ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు.