ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి సమయం ఆసన్నమైంది. ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ ప్రక్రియ ముగియగా, ఈనెలలోనే సౌది అరేబియా రాజధాని రియాద్‌లో వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రాంఛైజీలకు సమాచారం అందింది. ఈనెల 24,25 తేదీల్లో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్ సహా అగ్రశ్రేణి ఆటగాళ్లు వేలంలో పోటీ పడనున్నారు.