వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న రోజా
AP: వైసీపీ కార్యకర్తపై మాజీ మంత్రి రోజా చేయి చేసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన రోజాకు స్థానిక నేతలు, కార్యకర్తలు దారి ఇవ్వలేదు. దీంతో అసహానికి గురైన రోజా ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.