AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. అధికారులు, పోలీసుల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. కొందరు పోలీసులే ఈ తొక్కిసలాటకు బాధ్యులని భక్తులు చెబుతున్నారని అన్నారు. ఇంత మంది ఉండి కూడా ఆరుగురు ప్రాణాలు పోవడం సరికాదన్నారు. తప్పు జరిగింది.. క్షమించండి అంటూ రాష్ట్ర ప్రజలను పవన్ కోరారు.