కామారెడ్డిలో ఎన్టీఆర్ వర్ధంతి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షులు సాయిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనలో పలు సంస్కరణలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని పేర్కొన్నారు.