బాన్సువాడ: క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు సర్వేను పరిశీలించిన డీఎల్ఫీఓ
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో జరుగుతున్న రేషన్ కార్డు సర్వే తీరును శనివారం డీఎల్ఫీఓ నాగరాజు, ఎంపీవో సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసుధన్ రెడ్డి, కుమ్మరి రాజు, ఖాసిం పాల్గొన్నారు.