గాంధీకి నివాళులర్పించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరు మహాత్మా గాంధీ చూపించిన అడుగు జాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్చర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.