
జుక్కల్: మొక్కలు ఎండకుండా రోజు నీరు పట్టాలి: ఎంపీవో రాము
పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలను మంగళవారం పిట్లం మండల ఎంపీవో, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ నర్సరీలోని మొక్కలు ఎండకుండా రోజు నీరు పట్టాలని ఉపాధి హామీ కూలీలకు సూచించారు. అనంతరం కంపోస్ట్ షెడ్డును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కమలాకర్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.