మాజీ ఎంపీ ఎంవీవీ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. లాసన్స్‌బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ సోదాలు సాగుతున్నాయి. 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.