హెచ్ఐవీకి వ్యాక్సిన్ వచ్చేసింది
ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మంది హెచ్ఐవీ మహమ్మారి బారినపడుతున్నారు. అయితే హెచ్ఐవీ నియంత్రణకు అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు. దీని కోసం ఈ టీకాను వారం వ్యవధిలో రెండు మోతాదులుగా ఇస్తారు. తొలి డోసులో 20 శాతం వ్యాక్సిన్ను, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి వేస్తారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని వెల్లడించారు.