ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న వివాహితపై క్లీనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని సామర్లకోటకు చెందిన మహిళ (28) హైదరబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసిస్తుంటారు. ఈ క్రమంలో స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18న ఓ ప్రైవేటు బస్సు బుక్ చేసుకున్నారు. అదే రోజు రాత్రి ఏపీకి బస్సులో బయలుదేరారు. ఒంటరిగా ఉన్న వివాహితపై బస్సు క్లీనర్ బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఇంటికి చేరుకున్న మహిళ.. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దాంతో చౌటుప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.