కోడిమ్యాల మండల స్థాయి సీఎం కప్-2024 క్రీడా ఎంపిక పోటీలు ఉత్సాహంగా రెండవ రోజు కొనసాగాయి. కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం క్రీడలు కొనసాగినట్లు ఎంపీడీవో స్వరూప, ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. జూనియర్ బాలికలకు వాలీబాల్ క్రీడాంశంలో పోటీలు నిర్వహించగా నమిలికొండ జట్టు ప్రథమ స్థానం, కొడిమ్యాల జట్టు ద్వితీయ స్థానం పొందాయి.