ఛైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి.. ఛైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన డేటాను ఉంచుకోవడం నేరంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని కోర్టులు ఉపయోగించవద్దని ఆదేశించింది.