భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఈ విధానం ద్వారా అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు అందుబాటులోకి రావడంతో, కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విధానం 2025 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది. దీనికోసంఈ నెలాఖరులో సమావేశం కానున్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతుల్లో జాప్యాన్ని, అక్రమ వసూళ్లను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.