పక్క ట్రాక్‌లోకి మరో రైలు రావడంతో ప్రమాదం (వీడియో)
మహారాష్ట్రలోని జల్గావ్లో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చైను లాగడంతో పుష్పక్ రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు కిందికి దిగి పక్కనున్న పట్టాలపైకి చేరుకోగా.. అదే సమయంలో దానిపై దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ప్రయాణికుల మీదుగా రైలు దూసుకెళ్లడంతో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే, ఇంకా ఎంతమంది మృతి చెందారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.