మహారాష్ట్రలోని పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ అనే నాడీ సంబంధిత వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 22 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువగా 12-30 ఏళ్ల వయసు వారు ఉన్నారని అధికారులు తెలిపారు. శాంపిల్స్ ను టెస్టుల కోసం ICMR-NIVకి పంపామని చెప్పారు. కలుషితమైన నీరు/ ఆహారం తీసుకోవడమే కారణంపై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యాధి సాధారణంగా వైరల్/బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ వల్ల వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.