టీడీపీ మాజీ నేతలను కలిపిన పాత కేసు
AP: తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలను ఒకే చోటుకి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు. విజయవాడ కోర్టుకు తెలంగాణ, ఏపీకి చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు. వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీలో ఉండగా.. మిగిలిన వారు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. 2007లో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి విచారణ ఉండటంతో వీరంతా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. దాంతో కోర్టు ఆవరణం సందడిగా మారింది.