వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలొద్దు: మంచు విష్ణు

85చూసినవారు
వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలొద్దు: మంచు విష్ణు
ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులందరూ సున్నితమైన అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించకుండా ఉండాలని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కోరారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'వివాదాస్పద అంశాల్లోకి వెళ్లకుండా ఉండండి. ఇటీవల జరిగిన ఘటనల్లో కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి. వాటిపై చట్టం తన దారిలో న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల సంబంధిత పక్షాలకు మరింత నష్టం జరుగుతోంది' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్