కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: షర్మిల
AP: మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీ కాంగ్రెెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. శనివారం ఎక్స్ వేదికగా.. ఇంతకాలం కొత్త బస్సులు కొంటున్నామని, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ఉచిత బస్సు పథకం అమలు సాగతీతకు సిద్ధమయ్యారని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు.