BRS చేసిన అప్పుల వల్ల తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ లో భూములు, హైటెక్ సిటీ ఇలా అన్నీ అమ్మేశారు. ఆఖరికి వైన్ షాపుల్నీ మిగల్చలేదు. వీరు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం' అని తీవ్రస్థాయిలో అసెంబ్లీలో ధ్వజమెత్తారు.