Top 10 viral news 🔥
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.