తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని తన తండ్రి మోహన్‌బాబు స్కూల్‌ను అక్కడ పెట్టారని నటుడు మంచు మనోజ్ చెప్పారు. కుటుంబంతో కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని మనోజ్ అన్నారు. ‘వినయ్ వైఖరి వల్లే మా ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయి. మా అమ్మ ఆస్పత్రిలో లేరు, ఇంట్లోనే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.