ఏపీలో ఏకంగా 50 లక్షల మందికి చెందిన సమాచారం మిస్ అయిందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కేవలం 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని.. మిగతా 50 లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని కలెక్టర్ల సదస్సులో వెల్లడించింది. గత సర్వేలో వీరెవరూ వివరాలు ఇవ్వకపోవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా అందరి వివరాలు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.