చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్
AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన పోక్సో కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ కూతురిపై అత్యాచారం జరిగిందంటూ అసత్య ప్రచారం చేశారని బాలిక తండ్రి కేసు పెట్టినట్లు తొలుత పోలీసులు చెప్పారు. అయితే తాము ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని బాలిక తల్లిదండ్రులు స్పష్టం చేశారు. తమను పరామర్శించిన చెవిరెడ్డిపై తామెందుకు కేసు పెడతామని ప్రశ్నించారు. పోలీసులే ఓ పత్రంపై సంతం పెట్టించుకున్నారని చెప్పారు.