చల్పాక ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు!

67చూసినవారు
చల్పాక ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు!
TG: చల్పాక ఎన్‌కౌంటరుపై గుత్తికోయలు అనుమానాలు లేవనెత్తారు. అన్నంలో విష ప్రయోగం జరిగి ఉంటుందని ఆరోపించారు. దీంతో మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. మృతదేహాల వద్ద తుపాకులు ఉన్న విధానం చూసి సందేహాలు రేకెత్తుతున్నాయని తెలిపింది. మరోవైపు ఎన్‌కౌంటర్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, మరోవైపు బూతకపు ఎన్‌కౌంటర్లు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయి’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్